Pakistani Actress Sehar Shinwari: వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా (team india) అన్నీ విభాగాల్లో రాణించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా.. అందరూ కలిసికట్టుగా ఆడారు. దాంతో 70 పరుగుల తేడాతో విజయం సాధించింది. వరల్డ్ కప్లో రోహిత్ సేన విజయ పరంపర కొనసాగుతోంది. లీగ్ దశ నుంచే ఇంటి ముఖం పట్టిన పాకిస్థాన్ జీర్ణించుకోలేక పోతుంది. ఇప్పటికే ఆ దేశ మాజీ క్రికెటర్లు అక్కసు వెళ్లగక్కారు అబ్దుల్ రజాక్ అయితే ఐశ్వర్య గురించి కామెంట్ చేసి.. వెనక్కి తగ్గిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో నటి స్పందించారు.
న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్ ఫిక్స్ అయ్యిందని పాక్ నటి సెహర్ షిన్వారీ (Sehar Shinwari) సంచలన ఆరోపణలు చేసింది. టీమిండియా విజయం సాధిస్తే తట్టుకోలేక పోయింది. భారత ఆటగాళ్లు మంచి నటులు.. మ్యాచ్ ఫిక్స్ అయ్యిందని వారికి ముందే తెలుసు.. నిజంగా మ్యాచ్ ఆడుతున్నట్టు నటించారని ట్వీట్ చేసింది. ఇలా తనలోని ఈర్ష్యను ట్వీట్ రూపంలో తెలియజేసింది.
భారత జట్టు మరోసారి ఫైనల్కు (final) వెళ్లడాన్ని జీర్ణించుకోలేక పోతున్నానని అక్కసును వెళ్లగక్కింది. పాకిస్థాన్ కన్నా భారతదేశం అన్నింటిలో మన కన్నా ఎందుకు ముందు ఉందని రాసింది. దాయాది దేశ ఆటగాళ్లు రాణిస్తే తట్టుకోలేక పోయింది సెహర్ షిన్వారీ (Sehar Shinwari). పాక్ నటి తీరును నెటిజన్లు ఖండిస్తున్నారు. ఇది సరికాదు.. ఆటను ఆటగా చూడాలె.. మీ జట్టు ఫెయిల్ అయ్యిందని మరో జట్టును చులకన చేయడం సరికాదని కామెంట్ చేస్తున్నారు.