Salaar: ముందు KGF చాలా చిన్నది..యష్ కామెంట్స్ వైరల్
కెజియఫ్ హీరో యష్(yash) చేసిన కొన్ని కామెంట్స్.. ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. యష్ చెప్పిన దాని ప్రకారం చూస్తే.. అసలు ప్రశాంత్ నీల్ ఏం ప్లాన్ చేస్తున్నాడు? అనేది అంతు బట్టకుండా ఉంది.
ఇప్పటివరకు ప్రశాంత్ నీల్(Prashanth Neel) చేసింది కేవలం మూడు సినిమాలే. ఉగ్రం, కెజియఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2. ఈ సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. కెజియఫ్ 2 ఏకంగా ప్రశాంత్ నీల్‌ను వెయ్యి కోట్ల డైరెక్టర్‌ను చేసేసింది. ఇక ఇప్పుడు నీల్ నుంచి హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా సలార్ వస్తోంది. డిసెంబర్ 22న సలార్(salaar) రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ 1న ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో.. యష్ ఓల్డ్ స్టేట్మెంట్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
కెజీయఫ్ 2 ప్రమోషన్స్ సమయంలో యష్(Yash) మాట్లాడుతూ.. నీల్ క్రియేట్ చేసిన దాంట్లో.. నాకు చెప్పిన దానిలో కేజీయఫ్ అనేది చాలా చిన్న భాగం మాత్రమే. అసలు విషయం వేరే ఉందని తెలిపాడు. ప్రశాంత్ నీల్ కూడా అది నిజమే అని కన్ఫర్మ్ చేసాడు. ఈ లెక్కన.. నీల్ మావా ప్లానింగ్‌లో కేజీయఫ్ కంటే మించిన బిగ్గెస్ట్ ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయని క్లియర్‌గా తెలుస్తోంది. అందుకే.. సలార్ సినిమా ప్రశాంత్ నీల్ యూనివర్స్‌లో భాగంగా వస్తున్నట్టుగా చెబుతున్నారు. సలార్ గురించి యష్ ప్రత్యేకంగా చెప్పనప్పటికీ.. కెజియఫ్2 తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమా ఇదే కాబట్టి.. మామూలుగా ఉండదనే చెప్పాలి. ఇప్పటికే ప్రశాంత్ నీల్.. కేజీయఫ్ కంటే సలార్ పదింతలు ఎక్కువ హై మూమెంట్స్‌తో ఉంటుందని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పుడు యష్ స్టేట్మెంట్ మరింత హై ఇస్తోంది. ఒకవేళ సలార్, ప్రశాంత్ నీల్ యూనివర్స్ అయితే.. ఖచ్చితంగా రాఖీభాయ్ కూడా ఈ సినిమాలో కనిపించే ఛాన్స్ ఉంది. ఇలాంటి విషయాల్లో క్లారిటీ రావాలంటే.. డిసెంబర్ 22 వరకు వెయిట్ చేయాల్సిందే మరి.