WNP: పెబ్బేరు ఎంపీడీవో కార్యాలయం వద్ద ఉన్న ఖేల్ ఇండియా ఫుట్బాల్ మైదానాన్ని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి బుధవారం పరిశీలించారు. మైదానంలో కలెక్టర్ రూ.10 లక్షల తన సొంత నిధులతో కొత్తగా ఏర్పాటు చేయించిన హైమాస్ట్ లైట్లను తనిఖీ చేశారు. త్వరలోనే వీటి ప్రారంభోత్సవానికి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని క్రీడా అధికారులను ఆదేశించారు.