AKP: జిల్లాలో 34 ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని డీఐఈఓ ఎం.వినోద్ బాబు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. సోమవారం జరిగే మొదటి సంవత్సరం పరీక్షలకు 13,153 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో గల అన్ని రూమ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసామన్నారు.