HYD: ఏప్రిల్ ఒకటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ షాపులను బంద్ చేస్తామని తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ తెలిపినట్లు HYDలో చికెన్ వ్యాపారులు పోస్టర్లు అంటించారు. మార్జిన్ ఇవ్వని పౌల్ట్రీ కంపెనీల దౌర్జన్యానికి చికెన్ వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని, తగ్గించిన మార్జిన్‌ను సరిచేసే వరకు బంద్ కొనసాగిస్తామన్నారు.