సిరిసిల్ల పట్టణంలోని నెహ్రూ నగర్లో నివాసం ఉంటున్న పవర్లూమ్ వార్పిన్ కార్మికుడు ఎక్కల్దేవి దామోదర్ ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న మున్సిపల్ వైస్‌ఛైర్మన్ దార్ల సందీప్ అక్కడికి వెళ్లి పార్థివ దేహానికి నివాళులర్పించారు. వారి మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని తెలియాజేశాడు. బాధిత కుటుంబానికి ఆర్థిక సహయంగా రూ. 5000 అందజేశారు.