BDK: భద్రాద్రి శ్రీరామనవమి వేడుకల నేపథ్యంలో భక్తుల భద్రత కోసం 2 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. ఉత్సవాల పర్వదినాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పటిష్టమైన ఆంక్షలు అమలు చేస్తున్నామన్నారు. భక్తులు స్థానిక ప్రజలు పోలీసు నిబంధనలకు సహకరించి వేడుకలను విజయవంతం చేయాలని కోరారు.