సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో పలు రైళ్లు (Trains) ఆలస్యంగా నడుస్తున్నాయి. దీనిపై రైల్ నిలయం సికింద్రాబాద్లోజీఎం అరుణ్‌కుమార్‌జైన్ డీఆర్ఎంలతో సమీక్ష నిర్వహించారు.
సామాన్య ప్రజలు దూరం, దగ్గర అని తేడా లేకుండా చవక, భద్రత, సౌకర్యవంతంగా గమ్యస్థానాలను చేరుకునేందుకు ఎక్కువగా పేద, మధ్య తరగతి వారు రైలు ప్రయాణాన్ని (Train travel) ఆశ్రయిస్తారు. అయితే సకాలంలో రైళ్లు స్టేషన్లకు రాక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొద్ది నెలలుగా ఇదే తీరుగా ఉండడంతో వివిధ అవసరాల కోసం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఢిల్లీ, సికింద్రాబాద్(Secunderabad), విజయవాడ, చైన్నె వైపు వెళ్లే వరకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆలస్యంగా నడుస్తున్నాయని మైకుల్లో అనౌన్స్ చేసి అసౌకర్యానికి చింతించుచున్నాం అంటూ చెప్పి రైల్వే అధికారులు చేతులు దులుపుకుంటున్నారు.
తాజాగా ప్రయాణికుల రైళ్లు (Trains) ఆలస్యంగా ఎందుకు నడుస్తున్నాయని ద.మ. రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌జైన్ (GM Arun Kumar Jain) అధికారులను ప్రశ్నించారు. కారణాలపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. కారణాలపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.రైలు కార్యకలాపాల భద్రత, సమయపాలనపై సికింద్రాబాద్‌లోని రైలు నిలయం నుంచి ఆరు డివిజన్ల డీఆర్ఎం (DRM) లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎం జైన్ సమయపాలనను మెరుగుపరచాలని డీఆర్ఎంలను ఆదేశించారు. ఇటీవల జోన్ పరిధిలో ఒక ట్రాక్టర్ రైల్వే ట్రాక్‌పై ఇరుక్కుపోయిన సంఘటనను ప్రస్తావించారు.