NGKL: ప్రభుత్వ 99 రోజుల ఆరోగ్య మిషన్లో భాగంగా నిర్వహిస్తున్న ప్రత్యేక వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ రవికుమార్, సర్పంచ్ మట్ట యాదమ్మ కోరారు. వెల్దండలో జరిగిన ఈ శిబిరంలో ఉచితంగా పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని వారు పేర్కొన్నారు.