ఒకప్పటి కీర్తి సురేష్ వేరు.. ఇప్పడున్న కీర్తి వేరు.. అనేలా రెచ్చిపోతోంది అమ్మడు. ఇప్పటికే గ్లామర్ డోస్ పెంచేసిన కీర్తి.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాను హీట్ ఎక్కిస్తూనే ఉంది. తాజాగా కీర్తి షేర్ చేసిన స్టంట్ వీడియో వైరల్‌గా మారింది.
Keerthy Suresh: మహానటి కీర్తి సురేష్ గురించి అందరికీ తెలిసిందే. మొన్నటి వరకు గ్లామర్ డోస్‌కు దూరంగా ఉన్న కీర్తి.. ఇప్పుడు మాత్రం అస్సలు తగ్గేదేలే అంటోంది. ఇక తాజాగా కీర్తికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహానటి తర్వాత వరుస లేడి ఓరియేంటెడ్ సినిమాలు చేసిన కీర్తి.. ప్రస్తుతం గ్లామర్ డోస్ కూడా పెంచేసింది. చివరగా తెలుగులో మెగాస్టార్ ‘భోళా శంకర్’ సినిమాలో కనిపించింది కీర్తి. ప్రస్తుతం అమ్మడి చేతిలో ఒక్క తెలుగు ప్రాజెక్ట్ కూడా లేదు. కానీ తమిళ్లో మాత్రం దూసుకుపోతోంది.
హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా లేడీ ఓరియెంట్ సినిమాలు చేస్తున్న కీర్తి.. హీరో రేంజ్లో స్టంట్లు కూడా చేస్తోంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. పలు ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూనే ఉంది. తాజాగా కీర్తి సురేష్ షేర్ చేసిన వీడియో మామూలుగా లేదు. చెన్నైలోని ఓ బీచ్‌లో మహీంద్రా థార్ నడుపుతున్న వీడియోని పోస్ట్ చేసింది అమ్మడు. సినిమాల్లో హీరోలు ఛేజింగ్ సీన్స్‌లో దుమ్ము లేపినట్టుగా.. ఇసుకలో ఓ రేంజ్లో స్టైలిష్‌గా జీప్ నడిపింది కీర్తి. ఈ వీడియో పోస్ట్ చేసి.. ఆదివారం చెన్నై బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్నట్టుగా తెలిపింది. దీంతో కీర్తి ఈ రేంజ్లో డ్రైవ్ చేస్తుందా, క్యూట్ బ్యూటీ అదరగొట్టేసిందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ప్రస్తుతం కీర్తి సురేష్ థార్ నడిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏదేమైనా కీర్తి అంటే.. ఆ మాత్రం ఉంటది మరి.