మెగా ప్రిన్స్ వరుణ్ తేజ- లావణ్య త్రిపాఠి రిసెప్షన్ నిన్న హైటెక్స్‌లో జరిగింది. విందుకు కొందరు ప్రముఖులే వచ్చి ఆశీర్వదించారు. నందమూరి ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా రాలేదు.
Varun lav Reception: వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఏడడుగులు వేసి ఒక్కటి అయిన సంగతి అందరికి తెలిసిందే. ఇటలీలోని టస్కనీలో జరిగిన పెళ్లి వేడుకకు మెగా, అల్లు లావణ్య త్రిపాఠి, ఉపాసన ఫ్యామిలీ మాత్రమే హాజరయ్యింది. నితిన్, ఒకరు ఇద్దరు ఇండస్ట్రీ సన్నిహితులు కూడా సందడి చేశారు. డెస్టినేషన్ వెడ్డింగ్ కాబట్టి, అక్కడి పెళ్లికి ఎక్కువ మంది హాజరుకాలేదు. దీంతో, సినీ ప్రముఖుల కోసం రిసెప్షన్ ఏర్పాటు చేశారు. నవంబర్ 5న హైదరాబాద్ ఎన్ కన్వెన్షన్ హాల్లో మెగా రిసెప్షన్ జరిగింది. ఫంక్షన్‌కి వెంకటేష్, దర్శకుడు సుకుమార్, నిర్మాత అశ్వినీ దత్.. ఇలా పలువురు గెస్ట్ హాజరయ్యి కొత్త జంట ని ఆశీర్వదించారు.
మెగా హీరో వరుణ్ లావణ్య రిసెప్షన్ వేడుకను చాలా సినీ ప్రముఖులు లైట్ తీసుకున్నారు. రిసెప్షన్ కి ఎవరూ రాలేదా అంటే, చాలా మంది ప్రముఖులు వచ్చారు. కానీ, మరి కొంత మంది మాత్రం పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తోంది. అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగ చైతన్య మాత్రమే వచ్చాడు. నాగార్జున కూడా రాలేదు. ఇక, నందమూరి కుటుంబం నుంచి బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇలా ఏ ఒక్కరూ రాలేదు.
వరుణ్ పెద్ద హీరో కాకపోయినా మెగా ఫ్యామిలీ హీరో. చిన్న, పెద్ద అనే తేడాలేకుండా అన్ని సినిమాల్లో చాలా మంది హీరోలకు నాగబాబు తండ్రిగా నటించారు. ఆయన కోసమైనా వరుణ్ రిసెప్షన్ కి రావాలి. కానీ, నాగబాబు కోసం కూడా రాలేదు. అంతెందుకు మెగా ఫ్యామిలీలోని చాలా మంది హీరోలు కూడా రాలేదు. పెళ్లికి వచ్చాం కదా అని రిసెప్షన్లో అల్లు అర్జున్, రామ్ చరణ్ కనపడలేదు.
మెగా స్టార్ ఇద్దరు కూతుళ్లు కూడా రాలేదు. సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ మాత్రమే స్టేజ్ పైన కనిపించారు. నిహారిక తన స్నేహితులతో సందడి చేసింది. నాగబాబు కొడుకు అనే కారణంతోనే వీరంతా పెద్దగా పట్టించుకోలేదా..? అదే చిరంజీవి కొడుకు అయితే, అలా చేస్తారా అని చాలా మంది కామెంట్స్ వినిపిస్తున్నాయి.