KMR: ఎల్లరెడ్డి మండలంలోని తిమ్మారెడ్డి గ్రామానికి చెందిన గూల గోవర్ధన్(26) అమెరికాలో గుండెపోటుతో మృతిచెందిన విషయం తెలిసిందే. మంగళవారం స్వగ్రామానికి ఆయన మృతదేహాన్ని తీసుకొచ్చారు. దీంతో కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. నాలుగేళ్ల క్రితం గోవర్ధన్ చదువుల నిమిత్తం అమెరికా వెళ్లాడు. ఎంఎస్ పూర్తి చేసి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. అమెరికాలో గుండెపోటుతో హఠన్మారణం చెందాడు.