ప్రకాశం: రేషన్ డీలర్లు అక్రమాలకు పాలు పడితే లైసెన్స్లు రద్దు చేస్తామని తహసీల్దార్ వెంకటేశ్వరరావు చెప్పారు. పుల్లలచెరువు మండల రెవెన్యూ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రేషన్ డీలర్లు ప్రజలకు అందించే బియ్యం, చక్కెర సరుకుల తూకాల్లో అవకతవకలు జరిగినా, మోసపూరితంగా బియ్యం కొన్నా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.