Gmail: జీ-మెయిల్లో లార్జ్ ఫైల్స్‌ను సెండ్ చేయడం ఎలా?
ముఖ్యమైన ఫైల్స్, డాక్యుమెంట్లు సెండ్ చేయాలన్నా జీ-మెయిల్‌ని ఎక్కువగా వాడుతుంటారు. అయితే 25mb కంటే ఎక్కువ స్టోరేజ్ ఉన్న ఫైల్స్‌ను పంపాలంటే ఈ ట్రిక్ ఫాలోవ్వండి.
Gmail: ప్రస్తుతం చాలామంది తప్పకుండా జీ-మెయిల్‌ను ఉపయోగిస్తుంటారు. క్వాలిటీ తక్కువ కాకుండా ఫొటోలు పంపాలన్నా, ముఖ్యమైన ఫైల్స్, డాక్యుమెంట్లు సెండ్ చేయాలన్నా జీ-మెయిల్‌ని ఎక్కువగా వాడుతుంటారు. అయితే 25mb కంటే ఎక్కువ స్టోరేజ్ ఉన్న ఫైల్స్‌ను పంపేందుకు కుదరదు. ఇలాంటి సమస్య రాకుండా ఈజీగా లార్జ్ డేటా డాక్యుమెంట్లు పంపేందుకు ఇలా చేయండి. మొదట పంపించాలని అనుకుంటున్న ఫైల్, వీడియో ఏదైనా గూగుల్ డ్రైవ్‌లో అప్లోడ్ చేయాలి. తర్వాత జీ-మెయిల్ పంపే సమయంలో కుడివైపు స్క్రీన్‌పై కనిపించే డ్రైవ్ ఐకాన్ ఎంచుకోవాలి. అదే డెస్క్‌టాప్‌లో ఈ ఐకాన్ కింద ఉంటుంది.
ఐకాన్‌ను క్లిక్ చేయగానే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో కనిపించే Insert From Drive ఆప్షన్‌పై క్లిక్ చేసి My Driveను ఎంచుకోవాలి. వెంటనే గూగుల్ డ్రైవ్‌లో అటాచ్ చేసిన ఫైల్స్ దర్శనమిస్తాయి. అందులో పంపించాలనుకుంటున్న లార్జ్ ఫైల్ని ఎంచుకుని Selectపై క్లిక్ చేయాలి. మీరు సెలెక్ట్ చేసుకున్న ఫైల్‌కు సంబంధించిన లింక్‌ను గూగుల్ క్రియేట్ చేసి ఆటోమెటిక్‌గా ఇ-మెయిల్‌కి పంపిస్తుంది. మెయిల్ సెండ్ చేసే ముందు లింక్‌ను కేవలం అందుకున్నవాళ్లు మాత్రమే యాక్సెస్ చేయాలా? ఎవరైనా యాక్సెస్ చేయవచ్చా? అనే ఆప్షన్లు కనిపిస్తాయి. మీకు నచ్చిన దాన్ని ఎంచుకుని మెయిల్ సెండ్ చేయవచ్చు.