KMM: జిల్లా అదనపు కలెక్టర్ డా. పి.శ్రీజ కల్లూరు మున్సిపాలిటీ కార్యాలయ ప్రాంగణాన్ని సందర్శించి, క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయ పరిపాలన తీరును సమీక్షించి, సిబ్బందికి అవసరమైన వసతులపై ఆరా తీశారు. కార్యాలయ నిర్వహణను మరింత మెరుగుపరచాలని, ప్రజలకు అందించే సేవల్లో ఎటువంటి జాప్యం లేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.