భారత పారిశ్రామిక రంగాన్ని ప్రపంచపటంలో నిలిపిన దార్శనికుడు JRD టాటా. దేశంలో మొదటి వాణిజ్య విమానాన్ని నడిపి ‘ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఏవియేషన్’గా నిలిచారు. ఆయన హయాంలోనే టాటా గ్రూప్ ఉక్కు నుంచి సాఫ్ట్వేర్ దాకా విస్తరించింది. లాభాల కంటే నైతిక విలువలకే పెద్దపీట వేసిన మహోన్నత వ్యక్తి. భారతరత్న అందుకున్న తొలి పారిశ్రామికవేత్తగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు.