»Varun Tej And Lavanya Tripathis Pictures Are Viral
Varun Tej : వివాహ బంధంతో ఒక్కటైన వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి ఫొటోలు వైరల్
దాదాపు ఆరేళ్ల తమ ప్రేమను వివాహబంధంగా మార్చుకున్నారు నటుడు వరుణ్ తేజ్ (Varun Tej) - నటి లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi). ఇటలీలోని టస్కానీ వేదికగా బుధవారం రాత్రి 7.18 గంటలకు వీరి పెళ్లి ఘనంగా జరిగింది.
మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej) – నటి లావణ్య త్రిపాఠి వివాహ బంధంలో అడుగుపెట్టారు. ఇటలీలోని టస్కానీలో బుధవారం రాత్రి 7.18 గంటలకు వీరి పెళ్లి జరిగింది. ఇరువురి కుటుంబ సభ్యులు, కొద్దిమంది స్నేహితుల సమక్షంలో లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) మెడలో వరుణ్ తేజ్ తాళి కట్టాడు. దీంతో ఇద్దరూ ఒక్కటయ్యారు. ఘనంగా జరిగిన ఈ వివాహ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్ కుటుంబాలకు చెందిన అగ్ర హీరోలు సందడి చేశారు. చిరంజీవి(Chiranjeevi), పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నవ దంపతులను ఆశీర్వదించారు.ఇలా కొణిదెల, అల్లు కుటుంబానికి చెందిన అగ్ర, యువ హీరోలందరూ షూటింగ్స్ నుంచి విరామం తీసుకుని ఈ వేడుకల్లో సందడి చేశారు. నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.
నితిన్, ఆయన సతీమణి షాలినీ, నీరజా కోన ఈ సెలబ్రేషన్స్‌లో భాగమయ్యారు. ఇక సినీ ఇండస్ట్రీ, ప్రముఖుల కోసం నవంబర్ 5న హైదరాబాద్(Hyderabad)లో రిసెప్షన్ నిర్వహించనున్నారు. మాదాపూర్ ఎన్-కన్వెన్షన్ వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది. కొన్నేళ్ల ప్రేమాయణం తర్వాత వరుణ్ – లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకున్నారు. అభిరుచులు కలవడంతో స్నేహం ప్రేమగా మారిందని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్ తమ లవ్ స్టోరీ పంచుకున్న విషయం తెలిసిందే. 2017లో ‘మిస్టర్’ సినిమా (Mister’ movie) కోసం వరుణ్ – లావణ్య తొలిసారి కలిసి నటించారు. అప్పుడే ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఆ మరుసటి ఏడాది వచ్చిన ‘అంతరిక్షం’లోనూ ఈ జంట ప్రేక్షకుల్ని మెప్పించింది. అయితే ఈ ఏడాది కాలంలో ఇద్దరి మధ్య స్నేహం క్రమంగా ప్రేమగా మారింది.