MDK: తూప్రాన్ మున్సిపల్ కార్మికులు చలో హైదరాబాద్ (ఇందిరా పార్క్) ధర్నాకు తరలి వెళ్లారు. మున్సిపల్ కార్మికులకు అనేక హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని సీఐటీయు ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపల్ కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందన్నారు. కార్యక్రమంలో అధ్యక్షులు బాబు తదితరులు పాల్గొన్నారు.