టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్య కారణాలను చూపుతూ ఆయన దరఖాస్తు చేసుకున్న బెయిల్ పిటిషన్ కు కోర్టు ఆమోదం తెలిపింది.
Adilabad rims some people attacked the medical students
స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ కేసులో చంద్రబాబు (Chandrababu)కు ఏపీ హైకోర్టు 4 వారాలు బెయిల్ మంజూరు చేసింది. నవంబర్ నెల 24 వరకూ ఈ మధ్యంతర బెయిల్ (Interim bail) ఉంటుంది. వచ్చే నెల 24 వరకూ ఈ మధ్యంతర బెయిల్ ఉంటుంది. నవంబర్ 24న తిరిగి చంద్రబాబు సరెండర్ అవ్వాలని కోర్టు తెలిపింది. స్కిల్ కేసులో ప్రధాన బెయిల్ పిటిషన్ పై వచ్చే నెల 10 విచారణ జరుపుతామని హైకోర్టు (High Court) తెలిపింది. చంద్రబాబు ఎడమ కంటికి ఆల్రెడీ ఆపరేషన్ జరిగింది. ఇప్పుడు కుడి కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ చేయాల్సి ఉన్నందున ఈ మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు ఒప్పుకుంది. 50 రోజులుగా చంద్రబాబు జైలులోనే గడుపుతున్నారు. ఆయన తరపు లాయర్లు ఏపీ హైకోర్టులో మధ్యంతర బెయిల్ కోసం అప్లై చేశారు. దానిపై ఆల్రెడీ వాదనలు (Arguments) జరిగాక.. తీర్పును హైకోర్టు ఇవాళ్టికి రిజర్వు చేసి, ఇవాళ తీర్పును ఇచ్చింది.