AP: సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఇవాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ మేరకు నిన్న రాత్రి కుప్పంలోని తమ నివాసానికి చేరుకున్నారు. ఇవాళ కడపల్లి నివాసం వద్ద ప్రజల నుంచి అర్జీలను ఆమె స్వీకరించనున్నారు. అనంతరం మంకలదొడ్డి, సింగారపురం, మొట్లచేను, కూసూరు గ్రామానికి చెందిన మహిళలతో సమావేశమవుతారు.