ELR: ఏలూరు మండలం వట్లూరు సమీపంలోని జాతీయ జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో వాహనదారుడుకి తీవ్ర గాయాలయ్యాయి. వైద్యం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.