ELR: కైకలూరు నియోజకవర్గంలో చిన్నపిల్లల అక్రమ విక్రయాల కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం కైకలూరు పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఐ రవికుమార్ వివరాలు తెలిపారు. ఇప్పటికే ప్రధాన నిందితురాలు ఫరీనా జైలులో ఉందన్నారు. మ్యారేజ్ బ్యూరోలు, మధ్యవర్తులు కలిసి పసిపిల్లలను సంతానం లేనివారికి డబ్బులకు విక్రయిస్తున్నట్టు బయటపడిందని పేర్కొన్నారు.