AP: పల్నాడు జిల్లా దాచేపల్లిలో గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూడు రోజులుగా లోడ్ రాకపోవడంతో ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజలు క్యూ లైన్లలో వేచి చూస్తున్నారు. పని మానుకుని గంటల తరబడి నిలబడినా, చివరకు సిలిండర్లు అందక నిరాశతో వెనుతిరుగుతున్నారు. ప్రభుత్వం దీనిపై వెంటనే స్పష్టత ఇవ్వాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.