HYD: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని భాగ్యనగరంలో శ్రీరామ యువ సేన భారత్ ఆధ్వర్యంలో భారీ శోభాయాత్రను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఈ నెల 27న ఉదయం 10:30 గంటలకు ధూల్‌పేటలోని ఆకాశప్పురి హనుమాన్ మందిరం నుంచి ప్రారంభంకానుంది. రామ భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని శోభాయాత్రను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే రాజాసింగ్ పిలుపునిచ్చారు.