»Ap Election Notification In March Mukesh Kumar Meena Said
AP elections: మార్చిలో ఏపీ ఎలక్షన్ నోటిఫికేషన్..ఇంకా 4 నెలలేనా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అక్కడి రాజకీయ నేతల్లో గుబులు రేపుతున్నాయి. ఎందుకంటే వచ్చే ఏడాది చివర్లో వస్తాయనుకున్న ఎన్నికలు మార్చిలోనే వస్తే చాలా తక్కువ సమయం ఉంటుందని ఆందోళన చెందుతున్నారు. అయితే ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
AP election notification in March mukesh kumar meena said
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నోటిఫికేషన్ మార్చిలో విడుదల అయ్యే అవకాశం ఉందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా(mukesh kumar meena )తెలిపారు. ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న వార్తల నేపథ్యంలో ఈ మేరకు వెల్లడించారు. ఇక రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఇచ్చిన సూచనలను బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు రాజకీయ పార్టీలు సన్నద్ధం కావడానికి ఇంకా నాలుగు నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నిర్వహణకు మార్చిలో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని, జనవరి 1 నాటికి తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తామని వెల్లడించారు. మీనా శుక్రవారం మీడియా ప్రతినిధులతో ఈ మేరకు వివరాలు వెల్లడించారు.
మార్చిలో ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడితే.. తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల విషయంలో ప్రకటించినట్లుగా నోటిఫికేషన్(notification) వెలువడేందుకు కనీసం మూడు వారాల ముందు ఎన్నికల షెడ్యూల్ను కచ్చితంగా ప్రకటిస్తారు. కాబట్టి ఏపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రెండవ వారంలో లేదా గరిష్టంగా ఫిబ్రవరి మూడవ వారంలో ప్రకటించనున్నారు. ఆ తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వెంటనే అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల నేతలు ఇప్పటి నుంచే సిద్ధం కావాలి. లేదంటే కొత్తగా ఆయా పార్టీల నుంచి పోటీకి ఎంపికయ్యే నేతల ప్రచారానికి చాలా తక్కువ సమయం ఉంటుంది. ఇక అధికార పార్టీకి దీటుగా ప్రతిపక్ష పార్టీలు సైతం మరింత కసరత్తు చేయాలి. పోటీపోటీగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఓటర్లను మక్కువ చేసుకుంటేనే వచ్చే ఎన్నికల్లో గెలుస్తారని చెప్పవచ్చు.
అయితే ముకేష్ కుమార్ మీనా విడుదల చేసిన స్పెషల్ సమ్మరీ రివిజన్ (SSR) – 2024 కింద డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్స్(voters) ప్రకారం, అక్టోబర్ 27, 2023 నాటికి ఆంధ్రప్రదేశ్లో సాధారణ ఓటర్లు, సర్వీస్ ఓటర్లతో సహా మొత్తం ఓటర్ల సంఖ్య 4,02,21,450 ఉన్నారు. ముసాయిదా జాబితాలో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారని ముఖేష్ మీనా కుమార్ తెలిపారు. మొత్తం మహిళా ఓటర్ల సంఖ్య 2,03,85,851 కాగా, పురుషులు 1,98,31,791 మంది ఉన్నారు. లింగమార్పిడి ఓటర్ల సంఖ్య 3,808. మొత్తం ఓటర్లలో సర్వీస్ ఓటర్లు 68,158 మంది ఉన్నారని, అనంతపురంలో అత్యధికంగా 19,79,775 మంది, అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యల్పంగా 7,40,857 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు.