»Busted Car Tire Software Employee Died At Bongulur Orr Hyderabad
Car tyre burst: పేలిన కార్ టైర్..సాఫ్ట్ వేర్ ఉద్యోగి స్పాట్ డెడ్
దసరా పండుగ కాదా అని ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి(Software employee) ఫ్యామిలీ వారి సొంతూరికి వెళ్లారు. కానీ తిరిగి వచ్చే క్రమంలో ఆ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. కారు డ్రైవింగ్ చేస్తున్న క్రమంలోనే టైర్ పేలి ఆ ఉద్యోగి అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటన హైదరాబాద్ బొంగుళూరు ఓఆర్ఆర్ పరిధిలో జరిగింది.
Exploded car tire Software employee died at bongulur orr hyderabad
ఇటివల దసరా పండుగ సందర్భంగా అనేక మంది ఉద్యోగులు, పిల్లలు సహా దాదాపు అందరూ పండుగ సెలబ్రేట్ చేసుకునేందుకు నగరాల నుంచి వారి వారి సొంత గ్రామాలకు వెళ్లారు. ఈ క్రమంలో అనేక చోట్ల పెద్ద ఎత్తున ప్రయాణికులు రావడంతో ట్రాఫిక్ జాం సమస్య కూడా తలెత్తింది. ఈ నేపథ్యంలో కొన్ని వాహనాలు వేగంగా వెళ్లడం వల్ల ప్రమాదాలు జరిగిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో మరింత వాహనాల రద్దీ(rush) పెరిగి గ్రామాలకు వెళ్లే వారి ప్రయాణం మరింత ఆలస్యం అయ్యింది. ఇక పండుగలకు వెళ్లి మళ్లీ తిరిగి వచ్చే క్రమంలో కూడా అనేక మంది ఒకేసారి రావడంతో బస్సులు, రైళ్లు సహా పలు వాహనాలు ప్రయాణికులతో కిటకిటలాడాయి.
ఈ తరుణంలోనే మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పండుగకు ఊరేళ్లి హైదరాబాద్(hyderabad) నగరానికి వస్తున్న ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి(Software employee) ప్రమాదవశాత్తు మృత్యువాత చెందాడు. అతను ప్రయాణిస్తున్న కారు టైరు ఆకస్మాత్తుగా పేలడంతో కారు పల్టీలు కొట్టింది. దీంతో డ్రైవింగ్ చేస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి మురళీకృష్ణ వరప్రసాదరావు(51) అక్కడికక్కడే మరణించారు. ఆ నేపథ్యంలోనే కారులో ఉన్న అతని భార్య నీలవేణి, కుమారుడు నెహంత్, తండ్రి లక్ష్మణరావుకు స్పల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదం బొంగుళూరు ఔటర్ రింగ్ రోడ్ పై జరిగింది. ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనపై ఎస్సై శ్రీనివాసరావు వివరాలు అందించారు.
వీరంతా పండుగ సందర్భంగా విజయనగరం వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే పండుగలకు సొంతూళ్లకు వారి సొంత వాహనాల్లో వెళ్లిన వారు తిరిగి వచ్చే క్రమంలో జాగ్రత్తగా రావాలని పోలీసులు సూచిస్తున్నారు. అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా డ్రైవింగ్ చేయడం, రోడ్లపైనే వాహనాలు ఆపడం వంటివి చేయోద్దని పోలీసులు(police) కోరారు.