NZB: మోస్రా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నేడు ఉదయం 9 గంటల నుంచి పలు విభాగాలకు సంబంధించిన వైద్య నిపుణులు అందుబాటులో ఉండనున్నట్లు సర్పంచ్ గుత్పే భూపాల్ రెడ్డి తెలిపారు. స్త్రీల ప్రసూతి వైద్యులు, అప్తమాలజి, ఆర్థోపెడిక్, డెంటల్, జనరల్ డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్ అందరూ అందుబాటులో ఉంటారన్నారు. గ్రామ ప్రజలందరూ సేవలను వినియోగించుకోవాలన్నారు.