PDPL: కునారం రైల్వే ఓవర్ బ్రిడ్జి (R.O.B)కు సంబంధించిన పెండింగ్ భూ సేకరణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. అప్రోచ్ రోడ్డు కోసం భూమి సేకరణ పూర్తయిందని, మిగిలిన షాపులను త్వరగా ఖాళీ చేయించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర నిధులు అందుబాటులో ఉండటంతో పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు.