JGL: కొండగట్టు హనుమాన్ జయంతి ఉత్సవాలకు భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎస్పీ అశోక్ కుమార్తో కలిసి అధికారులకు సూచనలు ఇచ్చారు. ఏప్రిల్ 1 నుంచి జరిగే ఉత్సవాలకు త్రాగునీరు, చలివేంద్రాలు, పార్కింగ్, లైటింగ్ ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.