విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ భారీ మల్టీస్టారర్ పట్టాలెక్కనుంది. షైన్ స్క్రీన్స్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ జూన్ చివరలో లేదా జూలైలో ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే వేగంగా జరుగుతున్నాయి.