ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, మోహన్ బాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కెరీర్ ప్రారంభంలో మోహన్ బాబు సరదాగా బెదిరిస్తూనే తనను ప్రోత్సహించారని వెల్లడించారు. ‘ఏయ్ సుద్దాలా.. కేవలం దాసరి నారాయణరావు సినిమాలకే పాటలు రాస్తే సరిపోదు.. నా సినిమాలకూ రాయ్. అవే నీకు ఫుడ్డు పెడతాయి’ అంటూ తనను కొత్త దిశలో నడిపించారని తెలిపారు. మోహన్ బాబు మంచి వ్యక్తి అని పేర్కొన్నారు.