మధ్య ప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా (Narottam Mishra) సంచలన వ్యాఖ్యలు చేశారు. నటి బీజేపీ ఎంపీహేమమాలిని పేరును ప్రస్తావిస్తూ చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. దతియాలో అభివృద్ధి ఏ స్థాయిలో జరిగిందంటే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు హేమమాలి (Hema Mali)ని చేత కూడా డ్యాన్స్ చేయించాం’ అని అన్నారు. సొంతపార్టీ ఎంపీపైనే అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని జేడీయూ (JDU) ట్వీట్ చేసింది.. సొంత పార్టీ ఎంపీనే మిశ్రా కించపరిచాడంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు.
బీజేపీ నేతల వ్యవహారం ఇలాగే ఉంటుందంటూ తీవ్రంగా విమర్శిస్తున్నారు. మధ్యప్రదేశ్ (Madhya Pradesh) అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నరోత్తమ్ మిశ్రా పాల్గొన్నారు. దాతియా నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు గెలిచిన మిశ్రా.. తాజాగా నాలుగో సారి ఇక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. దీంతో వేదికపై ఉన్న వారితో సహా సభకు హాజరైన జనం గట్టిగా నవ్వారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియా(Social media)లో వైరల్ గా మారింది. ఓ మహిళా నేతను, పార్లమెంట్ సభ్యురాలిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని మిశ్రాను విమర్శిస్తున్నారు. ప్రతిపక్ష నేతలపైనే కాదు సొంత పార్టీకి చెందిన మహిళా నేతలనూ బీజేపీ (BJP) లీడర్లు కించపరుస్తారని ఆరోపిస్తున్నారు.