DK Aruna: బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి సొంతగూటికి వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరతానని స్వయంగా ప్రకటించారు. దీంతో మిగతా నేతల గురించి చర్చ జరుగుతోంది. అందులో ప్రముఖంగా వినిపించే పేర్లలో వివేక్ వెంకటస్వామి, డీకే అరుణ తదితరులు ఉన్నారు. బీజేపీని వీడేది లేదని వివేక్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు జేజమ్మ (DK Aruna) వంతు వచ్చింది.
తనపై ఎవరో కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని డీకే అరుణ (DK Aruna) అంటున్నారు. తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం లేదని తేల్చిచెప్పారు. పార్టీలో చేరుతున్నానని కాంగ్రెస్ నేతలు మైండ్ గేమ్ ఆడుతున్నారని ధ్వజమెత్తారు. మోడీ నాయకత్వంలో పనిచేయాలంటే అదృష్టం ఉండాలని స్పష్టంచేశారు. తనను గుర్తించి బీజేపీ జాతీయ ఉపాధ్యక్ష పదవీ ఇచ్చారని గుర్తుచేశారు.
తన స్పందన తీసుకోకుండా కథనాలు రాయడం సరికాదని మీడియా సంస్థలపై విరుచుకుపడ్డారు. తన రాజకీయ భవిష్యత్‌ను నిర్ణయించాల్సిన హక్కు మీడియాకు ఎవరూ ఇచ్చారని ప్రశ్నించారు. పార్టీ మార్పు గురించి తనపై దుష్ప్రచారం చేసిన మీడియా సంస్థలపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరతానని ప్రకటించారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన నేతలు మాత్రం స్పందించడం లేదు. వివేక్, డీకే అరుణ (DK Aruna) మాత్రం చేరడం లేదని స్పష్టంచేశారు. మిగతా నేతల చేరికకు సంబంధించి క్లారిటీ లేదు.