సూర్యాపేట ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు కోసం ఈ నెల 10న జిల్లా కేంద్రంలో జరిగే మహాసభను విజయవంతం చేయాలని జేఏసీ నేతలు ప్రఫుల్ రాంరెడ్డి, చంద్రన్న ప్రసాద్ పిలుపునిచ్చారు. ఇవాళ సూర్యాపేటలో సన్నాహక సమావేశంలో వారు మాట్లాడారు. గౌరవ వేతనం, ఇంటి స్థలాలు, అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేశారు.