BHNG: కంది పంటకు ప్రమాదవశాత్తు నిప్పంటుకొని దగ్ధమైన ఘటన రాజపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన ఏ.స్వామి తనకున్న వ్యవసాయ భూమిలో ఒక ఎకరం కంది పంటను సాగు చేశారు. ప్రమాదవశాత్తు పంటకు నిప్పంటుకోవడంతో పూర్తిగా దగ్ధమైంది. అధికారులు పరిశీలించి నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుకున్నారు.