సీఎం కేసీఆర్ ను కొడంగల్ నుంచి పోటీ చేయాలని ఇప్పటికే ఆహ్వానించినట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(revanth reddy) తెలిపారు. ఒక వేళ కేసీఆర్ కొడంగల్లో పోటీకి రాకపోతే తానే కామారెడ్డి నుంచి పోటీ చేసి చిత్తుగా ఓడిస్తామని రేవంత్ అన్నారు.
Revanth Reddy said Prepare to compete against KCR with kamareddy will be defeated thoroughly
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పై పోటీ చేసేందుకు తాను సిద్ధమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(revanth reddy) తెలిపారు. అధిష్టానం ఆదేశిస్తే తానైనా లేదా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అయినా పోటీ చేస్తామన్నారు. అంతేకాదు ఇప్పటికే కేసీఆర్ ను కొడంగల్ నుంచి పోటీ చేయాలని కోరినట్లు తెలిపారు. కొడంగల్లో కేసీఆర్ పోటీకి రాకపోతే కామారెడ్డిలో తాను పోటీ చేసేందుకు సిద్ధమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ క్రమంలో కేసీఆర్ పై పోటీ చేసి చిత్తు చిత్తుగా ఓడిస్తామని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అంటూ ఈసారి స్పీడ్ పెంచారు కాంగ్రెస్ నేతలు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో తప్పకుండా గెలిచితీరుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇటివల సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుంచి పోటీ చేస్తానని చెప్పి బుధవారం బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరారు. ఇదే క్రమంలో మరికొంతమంది సీనియర్ నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతారని కాంగ్రెస్(congress) అంచనా వేస్తోంది. దీంతో జాబితా విడుదలలో జాప్యం జరుగుతోందని తెలుస్తోంది. మరోవైపు వామపక్షాలకు ఇచ్చే సీట్లపై కూడా సమస్యగా ఉన్నట్లు సమాచారం. సీపీఐకి కొత్తగూడెం, చెన్నూరు స్థానాల కేటాయింపుపై భిన్నాభిప్రాయాలు లేకపోయినా, సీపీఎంకు ఇచ్చే సీట్ల విషయంలో మాత్రం ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం.