BHPL: ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంజూరైన ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. ఇవాళ ఐడీఓసీలో మున్సిపల్, MPDOలతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 3,943 ఇళ్లు మంజూరు కాగా, 3,178కు మార్కౌట్ పూర్తి, 27 ఇళ్లు పూర్తయ్యాయని తెలిపారు. BHPL నియోజకవర్గంలో 26 ఇళ్లు పూర్తయ్యాయని, ఆలస్యం లేకుండా పనులు పూర్తి చేయాలని సూచించారు.