ATP: గుత్తి(మం) అబ్బేదొడ్డి గ్రామంలో సోమవారం జరిగిన అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యమన్నారు. రైతుల కోసం ప్రభుత్వం ఏడాదికి రూ.20,000 నగదును సాయం అందిస్తుందని చెప్పుకొచ్చారు. రైతులు ఆధునిక వ్యవసాయం వైపు నడవాలని సూచించారు.