Virat Kohli: భార్యతో కలిసి కొత్త వ్యాపారం ప్రారంభించిన విరాట్ కోహ్లీ
టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ తన సతీమణి అనుష్క శర్మతో కలిసి కొత్త వ్యాపారంలోకి అడుగు పెట్టాడు. వీరిద్దరూ నిసర్గ పేరుతో కొత్త వెంచర్‌ను కూడా ప్రారంభించారు. విజయదశమి రోజు తమ కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నట్లు కోహ్లీ, అనుష్క శర్మ ప్రకటించారు.
ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరో వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. ఇప్పటికే ఓ వైపు క్రికెట్ ఆదాయానికి తోడు మరోవైపు ప్రకటనల ద్వారా కోహ్లీ సంపాదిస్తున్నాడు. అలాగే కొన్ని కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇలా పెద్ద మొత్తంలో డబ్బులు సమకూర్చుకుంటున్నాడు. అనేక వ్యాపారాల్లో కోహ్లీకి పెట్టుబడులు కూడా ఉన్నాయి. తాజాగా తన భార్య అనుష్క శర్మతో కలిసి కోహ్లీ మరో కొత్త వ్యాపారంలోకి ఎంట్రీ ఇచ్చాడు.
పలు కార్యక్రమాలను అంటే ఈవెంట్లను నిర్వహించి ప్రచారం కల్పించే వ్యాపారంలోకి కోహ్లీ, అనుష్క శర్మలు అడుగుపెట్టారు. ఈ విషయాన్ని విజయదశమి రోజున వారు ప్రకటించారు. ఇప్పటికే కొన్ని కంపెనీలతో వీరు ఒప్పందం కూడా కుదుర్చుకున్నాడు. కొన్ని కంపెనీలకు యాడ్స్ చేయడం, ప్రచారం చేయడం, అలాగే వాటిని ప్రమోట్ చేసి ఆదాయాన్ని పొందడం వంటివి కోహ్లీ, అనుష్క శర్మ వ్యాపారంలో ప్రధాన అంశాలు.
కొత్తగా ప్రారంభించిన ఈ వ్యాపారం కోసం ‘నిసర్గ’ పేరుతో కోహ్లీ దంపతులు వెంచర్‌ను కూడా మొదలు పెట్టారు. ఎలైట్ ఆక్టేన్ అనే సంస్థతో నిసర్గ ఒప్పందం చేసుకుంది. మోటార్ స్పోర్ట్స్, ఎంటర్ టైన్ మెంట్ కార్యక్రమాల నిర్వహణలో ఎలైట్ ఆక్టేన్ సేవలు అందిస్తూ వాటిని ప్రమోట్ చేస్తోంది. మోటార్ స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్ విభాగంలో కొత్త ప్లాట్‌ఫామ్‌లను అమలు చేయడంలో ఎలైట్ ఆక్టేన్ ముఖ్య పాత్ర పోషించనుంది.