Megastar Chiranjeevi: గ్రాండ్‌గా మెగా 156 షురూ.. కానీ బడ్జెట్ ఎంతో తెలుసా!?
ఫైనల్‌గా మెగా 156 గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలతో లాంచ్ అయింది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే సమయంలో సినిమా బడ్జెట్ కూడా తెగ వైరల్ అవుతోంది.
భోళా శంకర్ వంటి డిజాస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సినిమా మెగా 156. బింబిసారతో బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు వశిష్ఠతో ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాడు మెగాస్టార్. ఇటీవలే అఫీషియల్‌గా అనౌన్స్ అయిన ఈ సినిమాను.. దసరా సందర్భంగా గ్రాండ్‌గా లాంచ్ చేశారు. రాఘవేంద్ర రావు, వీవీ వినాయక్, అల్లు అరవింద్ లాంటి ప్రముఖులు అతిథులుగా మెగా 156 పూజ కార్యక్రమం జరిగింది. ఒకప్పుడు తెలుగులో ఏ సినిమాకైనా ముందుగా మ్యూజిక్ వర్క్ ని స్టార్ట్ చేసి, ఆ తర్వాత రెగ్యులర్ షూటింగ్‌కి వెళ్లే వారు. కానీ ఇప్పుడు మాత్రం డైరెక్ట్‌గా షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు. కానీ మెగా 156 మాత్రం ముందుగా మ్యూజిక్ వర్క్స్‌తో స్టార్ట్ అయింది.
ఈ సినిమాకు కీరవాణీ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా యూవీ క్రియేషన్స్ వారు రిలీజ్ చేసిన వీడియోలో కీరవాణీ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో ఆరు పాటలు ఉంటాయి.. సినిమాని రీరికార్డింగ్ తో మొదలు పెట్టడం ఆనవాయితి. అందుకే.. ఒక సెలబ్రేషన్ సాంగ్‌తో మెగా 156 పూజ కార్యక్రమాలు జరుపుకుంది’ అని చెప్పాడు. చంద్రబోస్ ఈ పాటకి లిరిక్స్ రాశాడు. ప్రస్తుతం మెగా 156 గ్రాండ్ ఓపెనింగ్ వీడియో, పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇదే సమయంలో మెగా 156 బడ్జెట్ కూడా హాట్ టాపిక్ అవుతోంది. జగదేవక వీరుడు అతిలోక సుందరి సినిమా తర్వాత మెగాస్టార్ చేస్తున్న సోషియో ఫాంటసీ సినిమా ఇదే. దాంతో ఈ సినిమా కోసం యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ కేటాయించినట్టు సమాచారం. దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఈ ప్రాజెక్ట్ మెగాస్టార్ కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ సినిమాగా నిలనుంది.