AP: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టడీయల్ టార్చర్ కేసులో ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ విచారణ పూర్తి అయ్యింది. గుంటూరులోని సీసీఎస్ స్టేషన్లో 8 రోజుల పాటు ఈ విచారణ కొనసాగింది. దర్యాప్తు అధికారి, విజయనగరం ఎస్పీ దామోదర్ సునీల్ నాయక్‌ను విచారించారు. త్వరలోనే ఈ కేసు పూర్తి వివరాలు అధికారులు వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.