JN: రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు నిధులను ఒకే విడతలో రైతుల అకౌంట్లో జమ చేయాలని, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రాపర్తి సోమయ్య డిమాండ్ చేశారు. రైతు సంఘం ఆధ్వర్యంలో ఇవాళ పాలకుర్తి తాహసీల్దార్ కార్యాలయంలోపై డిమాండ్లతో కూడిన వినతి పత్రమును తాహసీల్దార్ సరస్వతికి అందజేశారు.