Guntur Karam: మహేష్ ఫ్యాన్స్‌కు మళ్లీ హ్యాండ్ ఇచ్చారుగా!
ఈసారి రావడం పక్కా.. బాక్సాపీస్ షేక్ చేయడం పక్కా అంటున్నారు గుంటూరు కారం మేకర్స్. కానీ అలా అంటూనే మరోసారి ఘట్టమనేని అభిమానులకు హ్యాండ్ ఇచ్చేశారు. దసరాకు గుంటూరు కారం అప్డేట్స్ ఏమి లేవని క్లారిటీ ఇచ్చేశాడు తమన్.
అతడు, ఖలేజా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ సినిమా గుంటూరు కారం. ఈ మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తుండగా.. హారికా హాసిని క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాను 2024 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నారు. అయితే అనుకున్న దానికన్నా చాలా లేట్‌గా షూటింగ్ స్టార్ట్ అవడంతో.. అనుకున్న సమయానికి గుంటూరు కారం రిలీజ్ ఉంటుందా? అనే అనుమానాలున్నాయి. కానీ ఈ మూవీ, ఎంత డిలే అయినా సరే అనుకున్న టైంకి రిలీజ్ చేసి తీరుతాం అని.. మ్యాడ్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చెప్పుకొచ్చాడు నిర్మాత నాగవంశీ.
అలాగే.. గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ రెడీ అయింది.. ఇప్పటికే తమన్ ఫైనల్ సాంగ్ రెడీ చేశాడు.. దసరాకు అప్డేట్ ఇస్తామని చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పుడు మాత్రం ఎలాంటి అప్డేట్ లేదనే చెప్పాలి. ‘గుంటూరు కారం’ సాంగ్ త్వరగా రిలీజ్ చేయండి అంటూ.. ఓ మహేష్ బాబు అభిమాని ట్విట్టర్లో పెట్టిన పోస్ట్‌కి తమన్ రిప్లే ఇస్తూ.. నవంబర్, డిసెంబర్, జనవరి 2024 అంతా మనదే.. అంటూ రాసుకొచ్చాడు.
అంటే దసరాకు గుంటూరు కారం నుండి ఫస్ట్ సింగిల్ రావడం లేదు.. ఏదైనా ఉంటే నవంబర్లోనే ఉంటుందని ఇండైరెక్ట్‌గా చెప్పేశాడు తమన్. కానీ దసరా రోజు ఫ్యాన్స్‌ను ఖుషి చేయడానికి.. ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ అప్డేట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. దీంతో దసరాకు గుంటూరు కారం నుంచి ఎలాంటి అప్డేట్స్ బయటికొచ్చే ఛాన్స్ లేదు. ఇదే కాదు గతంలో కూడా ఇలాగే ఊరించి మహేష్ ఫ్యాన్స్‌కు హ్యాండ్ ఇచ్చారు మేకర్స్.