ఈసారి ప్రభాస్ బర్త్ డే వేడుకలు ఊహకందని విధంగా జరగబోతున్నాయి. సలార్ సినిమా రిలీజ్‌కు ముందు వస్తున్న బర్త్ డే కావడంతో.. సెలబ్రేషన్స్ పీక్స్‌లో ప్లాన్ చేస్తున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్. అక్టోబర్ 23న తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా ప్రభాస్ బర్త్ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే బర్త్ డే వేడుకలకు సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
హ్యాపీ బర్త్ డే సలార్.. అంటూ హైదరాబాద్‌లో భారీ ఎత్తున కటౌట్ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా మోత మోగిపోతోంది. ఇక సెలక్టెడ్ హ్యాష్‌ట్యాగ్స్ కోసం ప్రభాస్ సలార్ లుక్‌తో స్పెషల్ ఎమోజీని క్రియేట్ చేసింది ట్విట్టర్. #Prabhas, #Salaar, #SalaarCeaseFire, #SalaarComingBloodySoon, #SalaarCeaseFireOnDec22 అనే హ్యాష్‌ట్యాగ్స్ నెట్టింట ట్రెండ్ కానున్నాయి. జనవరి 21 వరకు ఈ స్పెషల్ హ్యాష్ ట్యాగ్స్ ట్విట్టర్లో కనిపించనున్నాయి. ఈ మధ్యలోనే.. అంటే డిసెంబర్ 22న సలార్ రిలీజ్ కానుంది.
అందుకే.. ఈ మూడు నెలలు ప్రభాస్ సినిమాల నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చిన.. సోషల్ మీడియా షేక్ అవడం గ్యారెంటీ. ముఖ్యంగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ సినిమా పై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. ఈ సినిమాతో ఖచ్చితంగా ప్రభాస్ సాలిడ్ బౌన్స్ బ్యాక్ అవడం పక్కా అని నమ్ముతున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. మరి రోజు రోజుకి అంచనాలు పెంచేస్తున్న సలార్.. బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.