VarunTej-Lavanya Tripati: పెళ్లి కోసం ఫ్లైట్ ఎక్కేసిన కొత్త జంట!
గత కొన్నాళ్లుగా పీకల్లోతు ప్రేమలో ఉన్న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి.. ఫైనల్‌గా ఇరు కుటుంబాలను ఒప్పించి.. ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్లికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌తో బిజీగా ఉన్నా ఈ జంట.. తాజాగా ఇటలీ ఫ్లైట్ ఎక్కేసింది.
వరుణ్-లావణ్యల నిశ్చితార్థం జూన్ 9న నాగబాబు ఇంట్లో గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు పెళ్లికి రెడీ అవుతున్నారు. జూన్‌లో అంగరంగ వైభవంగా ఎంగేజ్మెంట్ జరుపుకున్న ఈ జంట డిసెంబర్ 1న ఇటలీలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఇటలీలోని టుస్కానీ విలేజ్‌లో వీరిద్దరూ డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకోబోతున్నారు. ఇప్పటికే పెళ్లి పనులు కూడా స్టార్ట్ అయిపోయాయి. నాలుగు రోజుల పాటు జరుగనున్న ఈ పెళ్లి వేడుకకు కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారు.
రీసెంట్గా ప్రీ వెడ్డింగ్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌తో ఎంజాయ్ చేశారు వరుణ్, లావణ్య. ఈ వేడుకకకు చిరంజీవి, సురేఖ దంపతులతో పాటు, నాగబాబు ఫ్యామీలి, రామ్ చరణ్, ఉపాసన, వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్.. అలాగే అల్లు ఫ్యామిలీ, లావణ్య ఫ్యామిలీ, సభ్యులంతా పాల్గొన్నారు. ఇక ఇప్పుడు ఈ కొత్త జంట పెళ్లి కోసం ఇటలీ ఫ్లైట్ ఎక్కేశారు. ఇదే విషయాన్ని కన్ఫామ్ చేస్తూ.. వరుణ్ తేజ్ ఇన్‌స్టా స్టోరీ ద్వారా ఓ ఫోటో షేర్ చేసుకున్నాడు. ఫ్లైట్‌లో ఉన్నట్టుగా ఫోటో పెట్టాడు.
దీంతో వరుణ్, లావణ్య ఇటలీలోనే కొన్ని రోజులు ఉండబోతున్నారు. అక్కడ పెళ్లి పనులు కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇండియాకు తిరిగి రానున్నారు. త్వరలోనే వరుణ్, లావణ్య పెళ్లి డేట్ పై అధికారిక ప్రకటన రానుంది. ఇకపోతే.. ‘మిస్టర్’ సినిమాలో నటించిన వరుణ్, లావణ్య.. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడ్డారు. ఇప్పుడు పెళ్లి పీఠలెక్కడానికి రెడీ అవుతున్నారు.