KMR: బిక్కనూరులో సోమవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను సర్పంచ్ రేఖ ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. ఇల్లు లేని నిరుపేదలందరికీ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తోందన్నారు. ఇది పేద కుటుంబాలకు పెద్ద వరమని పేర్కొన్నారు. లబ్ధిదారులు సకాలంలో నిర్మాణ పనులు పూర్తి చేసుకుని గృహ ప్రవేశాలు చేయాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు ఉన్నారు