TG: అప్పులు తగ్గించామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని BRS ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డి అన్నారు. కానీ రుణం చెల్లించాల్సిన కాల పరిమితిని 22 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచిందని విమర్శించారు. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి ఎందుకు చెప్పట్లేదని ప్రశ్నించారు. వడ్డీ రేటు తగ్గించడం వల్ల రాష్ట్రానికి ఎంత లాభం జరిగిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.