»Traffic Alert In Saddula Bathukamma In Hyderabad October 22nd 2023
Traffic alert: రేపే సద్దుల బతుకమ్మ..హైదరాబాద్‌లో ట్రాఫిక్ అలర్ట్
తెలంగాణలో రేపే సద్దుల బతుకమ్మ పండుగ జరగనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో కూడా ఈ పండుగను పలు ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఆయా ప్రాంతాల్లో రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని సూచిస్తున్నారు.
Traffic alert in Saddula Bathukamma in Hyderabad october 22nd 2023
రేపు హైదరాబాద్‌లో కూడా (అక్టోబర్ 22న) సద్దుల బతుకమ్మ(Saddula Bathukamma) పండుగ ఘనంగా జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రాంతాలైన లుంబినీ పార్క్, అప్పర్ ట్యాంక్ బండ్ చుట్టూ పరిసరాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ ఆంక్షలు ఉంటాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయన్నారు. అవెంటో ఇప్పుడు చుద్దాం.
తెలుగుతల్లి జంక్షన్, కర్బలా మైదాన్ నుంచి ట్యాంక్ బండ్‌కు వచ్చే వాహనాలను మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అనుమతించబడరు. మరోవైపు ఇక్బాల్ మినార్ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను అప్పర్ ట్యాంక్ బండ్ వైపు కూడా అనుమతించరు. ఆ వాహనాలను తెలుగు తల్లి ఫ్లైఓవర్-కట్టమైసమ్మ- DBR- ఇందిరా పార్క్-గాంధీనగర్- RTC క్రాస్ రోడ్డు వైపు మళ్లిస్తారు.
V.V విగ్రహం నుంచి వచ్చే ట్రాఫిక్ ఎన్టీఆర్ మార్గ్ వైపు ఉన్న ఇందిరా గాంధీ విగ్రహం (నెక్లెస్ రోటరీ) వద్ద ప్రసాద్ ఐమాక్స్, మింట్ లేన్ వైపు మళ్లించబడుతుంది. దీంతోపాటు నల్లగుట్ట జంక్షన్ నుంచి బుద్ధ భవన్ వైపు ట్రాఫిక్ అనుమతించబడదు. నల్లగుట్ట క్రాస్ రోడ్స్ వద్ద రాణిగంజ్, నెక్లెస్ రోడ్డు వైపు మళ్లిస్తారు. లిబర్టీ నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే ట్రాఫిక్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఇక్బాల్ మినార్ ‘యు’ మలుపు మీదుగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ వైపు మళ్లించబడుతుంది.
సికింద్రాబాద్ నుంచి ఎగువ ట్యాంక్ బండ్ వైపు వచ్చే ట్రాఫిక్.. కర్బలా మైదాన్ వద్ద బైబిల్ హౌస్-జబ్బార్ కాంప్లెక్స్- కవాడిగూడ-లోయర్ ట్యాంక్ బండ్-కట్టమైసమ్మ, తెలుగు
తల్లి ఫ్లైఓవర్ వైపు మళ్లించబడుతుంది. మరోవైపు ముషీర్‌బాద్, కవాడిగూడ నుంచి చిల్డ్రన్స్ పార్క్ – అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే ట్రాఫిక్ అనుమతించబడదు. DBR మిల్స్ వద్ద లోయర్ ట్యాంక్‌బండ్-కట్టమైసమ్మ వైపు మళ్లించబడుతుంది.
ఈ నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే జంక్షన్లను అనుసరించకుండా చూడాలని స్థానిక ప్రజలను పోలీసులు(police) అభ్యర్థించారు. వాటిలో వి.వి. విగ్రహం, ఖైరతాబాద్, పాత పీఎస్ సైఫాబాద్, ఇక్బాల్ మినార్, తెలుగు తల్లి జంక్షన్, లిబర్టీ, నెక్లెస్ రోటరీ, రవీంద్ర భారతి, అంబేద్కర్ విగ్రహం, ట్యాంక్ బండ్, కవాడిగూడ క్రాస్ రోడ్స్, కట్టమైసమ్మ, కర్బలా మైదాన్, రాణిగంజ్, నల్లగుట్ట వంటి ప్రాంతాలు ఉన్నాయి.