MDK: రామాయంపేట పట్టణం నుంచి సిద్దిపేట వైపు వెళ్లే ప్రధాన రహదారి ప్రమాదకరంగా మారింది. ముఖ్యంగా సిద్దిపేట వైపు నుంచి వచ్చే వాహనదారులకు రోడ్డుపై ఉన్న గుంతలు స్పష్టంగా కనిపించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టి గుంతలను పూడ్చాలని వాహనదారులు, పట్టణ ప్రజలు కోరుతున్నారు.