సూర్యాపేట పట్టణంలోని కూరగాయల మార్కెట్ రోడ్డులో వెలిసిన అక్రమ నిర్మాణాలను మున్సిపల్ అధికారులతో కలిసి పోలీసులు సోమవారం తొలగించారు. మున్సిపాలిటీ అధికారులు ట్రాఫిక్ ఎస్సై సాయిరాం సమన్వయంతో ఈ తనిఖీలు చేపట్టారు. రహదారిపైకి చొచ్చుకొచ్చిన దుకాణాల వల్ల వాహనదారులకు ఇబ్బందులు కలుగుతున్నాయని, ఇకపై ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.